పెట్టుబడికి ఈ షేర్లు అనుకూలం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాల్ని మించి విజయం సాధిస్తే ఇన్‌ఫ్రా, డిఫెన్స్, కన్జూమర్ గూడ్స్, న్యూ ఎనర్జీ, టూరిజం తదితర థీమ్స్ మంచి పనితీరును ప్రదర్శిస్తాయని దేశీయ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ అంచనా వేస్తున్నది. మరోవైపు గ్రామీణ డిమాండ్, సాధారణ రుతువపనాలతో ద్విచక్ర వాహనాలకు, ట్రాక్టర్లకు డిమాండ్ పెరుగుతుందన్నది. ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకి వస్తే ఈ షేర్లు పెట్టుబడికి సానుకూలమని సిఫార్సు చేసింది.
ఇన్‌ఫ్రా: ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్‌తో పాటు రోడ్, మెట్రో ఈపీసీ కంపెనీలు
క్యాపిటల్ గూడ్స్: సీమెన్స్, ఏబీబీ, ఎసాబ్, ఇంగర్‌సాల్ రాండ్, కిర్లోస్కర్ న్యూమాటిక్
డిఫెన్స్: హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్, కొచ్ఛి షిప్‌యార్డ్
సిమెంట్: అల్ట్రాటెక్, అంబూజా సిమెంట్,
న్యూ ఎనర్జీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టెర్లింగ్ విల్సన్, ఎల్ అండ్ టీ, ప్రజ్ ఇండస్ట్రీస్
మెటల్స్: జేఎస్‌ఎల్, జేఎస్‌పీఎల్
బ్యాంక్స్: ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పీఎన్‌బీ
పీఎస్‌యూలు: పెట్రో మార్కెటింగ్ కంపెనీలతో పాటు అన్ని రంగాల్లోని ప్రభుత్వ సంస్థలు






