18 July, 2026 | 9:28 AM

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

14-12-2024 04:14 PM

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవంపై లోక్ సభలో రెండో రోజు చర్చ జరుగుతోంది.  రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాముల్ గాంధీ మాట్లాడుతూ... అనేక మంది మేధావులు ఆలోచనలకు రూపం రాజ్యాంగం అన్నారు. దేశంలోని ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలు ఫాలో అవుతారు. మహాభారత కాలం నుంచి సమాజంలో వివక్ష ఉందని చెప్పారు. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడి ఉదంతాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ద్రోణుడి విగ్రహాన్ని గురువగా భావించి ఏకలవ్యుడు విద్య నేర్చుకున్నాడు. ద్రోణుడు ఏకలవ్యుడి బొటనవేలుని గురుదక్షిణగా అడిగారు. నేడు దేశంలో అనేక మంది యువతి ఏకలవ్యుడి పరిస్థితే ఉందన్నారు. ఏకలవ్యుడి లాగానే వేలాది యువకులు కష్టపడి విద్యను నేర్చుకుంటున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలతో యువత కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతోందన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ కూడా రైతులపై లాఠీఛార్జ్ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్లకే మద్దుతు తెలుపుతోందని, ఏకస్వామ్యం ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం నేను హాథ్రాస్ కు వెళ్లానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హాథ్రాస్ లో ఆరేళ్ల క్రితం బాలికపై సామూహిక హత్యాచారం జరిగింది. హత్యాచార నిందితులు బయట తిరుగుతున్నారు.. బాలిక కుటుంబసభ్యులు తలెత్తుకోలేకపోతున్నారని రాహుల్ గాందీ విచారం వ్యక్తం చేశారు. బాలిక అంత్యక్రియలు కూడా చేయలేకపోయారని కుటుంబసభ్యులు బాధపడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియా ముందు అసత్యాలు చెప్పారని రాహుల్ ఆరోపించారు.. యూపీలో రాజ్యాంగం అమలు కావట్లేదు.. మనుస్మృతి అమలవుతోందని రాహుల్ ఆరోపించారు. ఆరేళ్లయినా హత్యాచార నేరస్తులకు శిక్ష పడలేదని ఆయన విమర్శించారు.  కుల, మత, జాతి, లింగ వివక్ష ఉండకూడదని రాజ్యాంగంలో పేర్కొన్నారు. దేశంలో జనగణన చేపట్టాలని రాహుల్ గాంధీ కోరారు.