రైతు రుణమాఫీపై హర్షం
- రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకుల సంబురాలు
- సీఎం రేవంత్, మంత్రుల చిత్రపటాలకు పాలభిషేకాలు
విజయక్రాంతి నెట్‌వర్క్, జూన్ 24: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేస్తున్నారు. సోమవారం సంబు రాలు కొనసాగాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా రేవంత్ చిత్రపటానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్లు పటేల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతుందని స్పష్టంచేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు మహాముత్తారం, మహాదేవ్‌పూర్ మండల కేంద్రాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ము సుకుల సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం, మంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఎంపీపీ కొండ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్‌సెల్ మండల అధ్యక్షుడు అత్తాం సదానందం, టౌన్ అధ్యక్షుడు నరేడ్ల ఓదెలు, ఉపాధ్యక్షుడు బానయ్య, జిల్లా కార్యదర్శి జనగామ నరసింహరావు, ప్రధాన కార్యదర్శి వెంకన్న, ప్రచార కమిటీ చైర్మన్ శ్రీనివాస్, లింగయ్యయాదవ్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.






