కాలయాపన చేసేందుకే మంత్రివర్గ ఉపసంఘం
23-06-2024 03:27 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతుబంధు పథకాన్నే కొనసాగిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు నిధులను ఎప్పుడైనా జూన్ లోనే వేసిందన్నారు. రుణమాఫీ చేపట్టినప్పటికీ రైతుబంధు నిధులు కూడా వెంటనే వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాలయాపన చేసేందుకు మంత్రివర్గం ఉపసంఘం వేశారని తెలిపారు. యాసంగి రైతుబంధు వేసిన ఖాతాల్లో వెంటనే వానాకాలం రైతుభరోసా వేయాలన్నారు. మిగితా హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రస్తావించట్లేదని ప్రశ్నించారు. విద్యుత్ శాఖకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించటం లేదని ఆరోపించారు. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షలలోపు రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయాలని కోరారు.






