12 June, 2026 | 2:16 AM

ముంచుకొస్తున్న ఎల్ నినో ముప్పు

12-06-2026 01:24 AM

భారతీయుల దైనందిన జీవితంపై ప్రభావం

సాగు ఆలస్యం.. జల విద్యుత్ ఉత్పత్తీ తగ్గే అవకాశం 

పంట దిగుబడులు తగ్గి.. ఆకాశానికి నిత్యావసరాల ధరలు

న్యూఢిల్లీ, జూన్ ౧౧: భారత్‌కు ఎల్ నినో ముప్పు ముంచుకొస్తున్నది. మునపటి సం వత్సరాల కంటే తీవ్రంగా భారతీయుల జీవితాలను ప్రభావితం చేయనున్నది. వేల కిలో మీటర్ల దూరంలోని పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఈ ‘ఎల్ నినో’ భారత్‌కు వచ్చే నైరుతి రుతుపవనాల గమనాన్ని మం దగమనానికి గురిచేస్తాయి.

దీంతో వర్షపాతం అమాంతం తగ్గుతుంది. జలాశ యా లు నిండవు. నదులు ఎండిపోతాయి. భూగర్భజలాలు పడిపోతాయి. తత్ఫలితంగా వ్యవ సాయ రంగం కుదేలవుతుంది. దిగుబడి తగ్గుతుంది. జలవిద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. రానున్న ఎల్ నినో కేవలం ఒక వాతావరణ మార్పు మాత్రమే కాదని, జన జీవితాలను ప్రభావితం చేసేదని ఇప్పటికే ప్రపంచ ఆర్థిక ఫోరం హెచ్చరించడం మరిం త ఆందోళన కలిగిస్తున్నది.

వర్షపాతం తగ్గితే రైతులు నీటి ఆధారంగా సాగు చేసే పంటలను పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది.  ఫలి తంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఫలితంగా నిత్యావసర ధరలు పెరుగుతాయి. నగరాల్లో నీటి ఎద్దడి నెలకొంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగి ఫ్యాన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం ఎక్కువుతుంది. ఫలితంగా విద్యుత్ గ్రిడ్‌లపై భారం పడుతుం ది. భారం ఎక్కువైతే గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమూ ఉంది. గత నెలలో దేశంలో రికార్డు స్థాయిలో 265 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఎల్ నినో ప్రభావంతో రానున్న రెండు నెలల్లో విద్యుత్ వినియోగం మరింత పెరగనుంది.