calender_icon.png 9 November, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ ఎడమ కాలువలో పడి లారీ డ్రైవర్ గల్లంతు

09-11-2025 08:49:53 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామం సమీపంలో ఉన్న సాగర్ ఎడమ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ గల్లంతయ్యాడు. గల్లంతైన లారీ డ్రైవర్ మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్ కు చెందిన ఈట శ్రీకాంత్(36)గా పోలీసులు గుర్తించారు. చెన్నై నుంచి కెమికల్ బ్యాగ్స్ లోడుతో మంచిర్యాలకు వెళుతుండగా ఆదివారం మధ్యాహ్నం గరిడేపల్లి మండలం మర్రికుంట సమీపంలోని సాగర్ ఎడమ ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ లారీని ఆపి డ్రైవర్, క్లీనర్ ఇతర లారీ డ్రైవర్లతో కలిసి వంట చేసుకుని భోజనం చేసి కాళ్లు చేతులు కడుక్కునేందుకు కాలువ ఒడ్డుకు చేరుకున్న క్రమంలో ఈట శ్రీకాంత్ అనే లారీ డ్రైవర్ కాలవలో పడి గల్లంతయ్యాడు. గరిడేపల్లి ఎస్ఐ చలి కంటి నరేష్ పర్యవేక్షణలో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.