calender_icon.png 9 November, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిమితికి మించి గూడ్స్ వాహనాలలో ప్రయాణించరాదు

09-11-2025 09:00:09 PM

నారాయణపేట రూరల్ ఎస్సై రాముడు..

ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు..

నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట రూరల్ ఎస్సై రాముడు ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. ప్రజల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజలను గూడ్స్ వాహనాల్లో తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. నారాయణపేట రూరల్ ఏరియాలో  కూలీలను తరలిస్తున్న గూడ్స్ వాహనాలను ఆటోలను, బొలెరో వాహనాలను పట్టుకుని జరిమానా విధించారు. రిపీటెడ్ గా కేసులు నమోదు అయితే వాహనాలను సీజ్ చేయడం జరుగుతది అని తెలిపారు.

అలాగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ప్రజలు తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణించాలని తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై రాముడు మాట్లాడుతూ... రవాణా చట్ట ప్రకారం గూడ్స్ వాహనాలు కేవలం సరుకుల రవాణా కోసమే ఉపయోగించాలి వాటిలో వ్యక్తులను, కూలీలను, చిన్నపిల్లలను రవాణా చేయడం నేరమని తెలిపారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం వల్ల తీవ్ర ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ ఉంటాయని తెలిపారు. వాహనదారులు, డ్రైవర్లు గూడ్స్ వాహనాల్లో వ్యక్తులను తీసుకెళ్లినట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత వాహనంపై చర్యలు తీసుకొని వానాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రజలు కూడా తమ ప్రాణాలను ముప్పుగా మారే ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుసరించరాదని కోరారు. ప్రతి ఒక్కరు రవాణా నియమాలు గౌరవించి సురక్షిత రవాణా కోసం బస్సులు, ఆటోలో పరిమితికి మించి వాహనాలలో ప్రయాణించరాదని తెలిపారు. ప్రజలు ప్రయాణించే టాప్పుడు మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి అని గుర్తుంచుకొని ప్రయాణం చేయాలని ఎస్ఐ  తెలిపారు.