09-11-2025 08:36:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిసాము.. చదువుల చెట్టు నీడలో అంటూ కనకాపూర్ అబ్దుల్లాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 2011-12 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్ధులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. పాఠశాలలో విద్య నేర్చుకున్న విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రైవేట్ ఉద్యోగులుగా, వ్యవసాయదారులుగా, నాయకులుగా, స్ధిరపడిన వారంతా ఒకేచోటకు చేరుకొని అప్యాయంగా పలకరించుకున్నారు. సభలో కుటుంబ సభ్యులను పరిచయం చేశారు.
ఒకరినొకరు ఆలింగనం చేసుకొని నిక్‌నేమ్‌లతో పిలుచుకున్నారు. తీపి జ్ఞాపకలను గుర్తు చేసుకొంటూ యోగాలను గురించి వివరించుకున్నారు. పాఠాలను నేర్పించిన 8 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. 15 ఏళ్ల నాటి విద్యార్థులను చూసిన ఉపాధ్యాయులు తన్మయత్వంతో మునిగిపోయారు. అనంతరం పూర్వ విద్యార్థులు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరికీ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు స్కూల్ ప్రాధానోపద్యాయులు బొడ్డు లక్ష్మణ్, వారితో పాటు ఉపధ్యాయులు రాజేశ్వర్, కాశీరాం, రాజారత్నం, దయాకర్, నగేశ్ పాల్గొన్నారు.