ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీ
18-04-2026 01:41 PM
సదాశివపేట: సదాశివపేట పట్టణ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ దిశగా వెళ్తున్న లారీని వెనక నుండి మరోలారి ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా రెండు ముక్కలుగా చీలిపోయింది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, స్థానికులు మరియు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






