కమాన్ పూర్ లో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం
కమాన్ పూర్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల మండల కేంద్రంలోని బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్, పాల్గొని సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్, పాలకవర్గ సభ్యులు, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.
కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ఆర్ నిధుల క్రింద రూ. 43 లక్షలు మంజూరు చేశారు. ఫ్రీజర్ బాక్స్ తో కూడిన వైకుంఠ రథానికి రూ. 20 లక్షలు, కమాన్ పూర్ బస్టాండ్ నిర్మాణం కోసం రూ.10 లక్షలు, చిల్డ్రన్ పార్క్ నిర్మాణం కోసంరూ. 13 లక్షలు మంజూరు చేసిన వాటిలో ఉన్నాయి. కమాన్ పూర్ గ్రామం పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






