calender_icon.png 19 July, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు బానిసల్లా పోలీసులు!

19-07-2025 02:17:13 AM

- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

- కార్పొరేటర్ సునీత దంపతులకు పరామర్శ

మల్కాజిగిరి, జూలై 18: కాంగ్రెస్ నాయకులకు కట్టు బానిసల్లా పనిచేస్తున్న పోలీసుల పని పడతామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ నాయకు ల దాడిలో గాయపడిన కార్పొరేటర్ సునీత, ఆమె భర్త రాముయాదవును శుక్రవారం మల్కాజిగిరిలో పరామర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నా యకులకు బానిసలుగా పనిచేస్తున్న పోలీసు అధికారుల పేర్లు డైరీలో రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పనిపడతామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడా నికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలుపొందాలని ప్రయత్నిస్తోందన్నారు.

తమ పార్టీ నాయకుల మీద, కార్యక ర్తల మీద కాంగ్రెస్ దాడి చేస్తుంటే, పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల మీ దే కేసులు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గూండాలతో వచ్చి మల్కాజ్గిరి లో రోడ్డుమీద గంట సేపు కూర్చుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తమ కార్యకర్త మీద దాడి వేస్తే తమ ఎమ్మెల్యేలతో వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.