2 September, 2026 | 3:40 PM

గోవులను తరలిస్తున్న లారీ పట్టివేత

02-09-2026 | 03:00pm

దమ్మపేట, సెప్టెంబర్ 02(విజయ క్రాంతి): ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ లారీని దమ్మపేట శివారులో భాగ్యనగర్ గో రక్షక్ టీమ్ సభ్యలు బుధవారం పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్నారనే సమాచారంతో కంటైనర్ లారీని వెంబడించిన గోరక్షక్ సభ్యలు దమ్మపేట వద్ద అడ్డుకున్నారు. కంటైనర్ లో సుమారు 100కు పైగా గోవులు ఉన్నట్లు గుర్తించారు. గో రక్షక్ సభ్యుల సమాచారంతో కంటైనర్ను దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమంగా గోవుల రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై లారీ డ్రైవర్, క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దమ్మపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.