2 September, 2026 | 4:17 PM

జనగామ డీసీసీలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి

02-09-2026 | 03:14pm

జనగామ, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, ఇందిరమ్మ ఇళ్లు వంటి చారిత్రాత్మక సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను, ఆయన ప్రజా సంక్షేమ బాటను, కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు