2 September, 2026 | 4:17 PM

బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నాం

02-09-2026 | 03:27pm

పాల్వంచ (విజయక్రాంతి): బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణకు మాదిగ జాతికి ఎటువంటి సంబంధం లేదనీ, విగ్రహ ఆవిష్కరణను మాదిగ జాతి బహిష్కరిస్తుందనీ వానపాకుల రాంబాబు, కటుకూరీ శేఖర్ బాబు స్పష్టం చేశారు. పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాల్వంచలో ఈనెల నాలుగవ తేదీన బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొంతమంది స్వార్థపరులు, మాదిగ జాతిని తాకట్టుపెట్టి వారి స్వార్థ ప్రయోజనాల కోసం గత పది సంవత్సరాల నుంచి అనేక బూర్జ్వ పార్టీల దగ్గర, అగ్రవర్ణాల కాళ్ల వద్ద విగ్రహం పేరుతో మాదిగ జాతిని తాకట్టుపెట్టి కించపరుస్తున్నారన్నారు. 

జాతి ఐక్యత కోసం కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా డబ్బులు దండుకొని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  ఈ దoదాను పాల్వంచ మండల మాదిగ జాతి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క  కార్యక్రమంలో , అల్లూరి సాంబశివరావు, పొట్ట పింజర బ్రహ్మానందరావు, కొత్తపల్లి శ్రీను, మోదుగు వెంకన్న, గుండెపాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.