2 September, 2026 | 4:15 PM

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

02-09-2026 | 03:33pm

రుద్రంగి, ఆగష్టు 02(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.

అనంతరం అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాష్ట్రనికి రైతులకు ఎన్నో సేవలందించిన గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు.ఆరోగ్యశ్రీ పథకం,ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్,రైతు రుణమాఫీ,ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు.రెండు లక్షల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి వైఎస్సార్ అడుగు జడల్లో నడిచారని అన్నారు.

వైఎస్సార్ మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని అందుకే సూరమ్మ ప్రాజెక్టును రైతుల కోసం మన ప్రాంతానికి మంజూరు చెపిచ్చారని అన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి,సర్పంచ్ గండి నారాయణ,ఎస్సి సెల్ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్,మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి సదుల్లా, వార్డు మెంబర్లు ఎర్రం అరవింద్,పుట్కపు మహిపాల్,నాయకులు గడ్డం శ్రీనివాస్,తర్రె లింగం, కట్కూరి దాసు,అక్కినపెళ్లి శ్రీనివాస్,, తదితరులు పాల్గొన్నారు.