calender_icon.png 11 June, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రణరంగంగా లాస్ ఏంజెల్స్

10-06-2025 12:00:00 AM

  1. ఆందోళనకారులు, నేషనల్ గార్డ్స్ దళాల మధ్య ఘర్షణ
  2. వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు
  3. పోలీసుల అదుపులో 2 వేల మంది ఆందోళనకారులు

లాస్ ఏంజెల్స్, జూన్ 9: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం వలసదారుల ఆందోళనతో రణరంగంలా మారిపోయింది. ఫెడరల్ ప్ర భుత్వం నగరవ్యాప్తంగా చేపట్టిన ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ని రసనలకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులకు, నే షనల్ గార్డ్ దళాలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

శుక్రవారం ప్రారంభమైన నిరసనలు సోమవారం నాటికి మరింత ఉధృతమయ్యాయి. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐఈసీ) విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2వేల మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్‌లోని ప్రధాన హై వేను తమ అధీనంలోకి తీసుకున్నారు. సిటీలో ని వాణిజ్య ప్రాంతమైన డౌన్‌టౌన్‌లో ఎవరూ గూమికూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఆందోళనకారులు పో లీసులపై రకరకాల వస్తువులు విసిరి దాడికి యత్నించారు. చాలా పోలీసు వాహనాలు తగలబెట్టారు. ఈ క్రమంలో ఒక ప్రభుత్వ జైలు సమీపంలో ఆ ందోళనకారులను కట్టడి చేసేందుకు అక్కడి పో లీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘ ర్షణల సమయంలో పలువురు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గాయపడినట్టు ఫెడరల్ అ ధికారులు తెలియజేశారు. ఒక్క శుక్రవారం రా త్రే కనీసం 29 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్టు సమాచారం.

మాస్కులు ఉంటే అరెస్ట్ చేయండి: ట్రంప్

మరోవైపు లాస్ ఏంజెల్స్‌లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని అమెరి కా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగిన ఆందోళనల్లో మా స్క్‌ల వినియోగాన్ని ఆయన నిషేధించారు. గత కొన్నాళ్లుగా ట్రంప్‌ను బద్ధవిరోధిలా ప్రవర్తిస్తున్న మస్క్.. తాజాగా లాస్ ఏంజెల్స్ నేషనల్ గార్డులను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం.

రాజకీయంగా దుమారం..

వలసదారుల అరెస్టు నేపథ్యంలో అధ్యక్షు డు ట్రంప్, లాస్ ఏంజెల్స్ స్థానిక నాయకత్వం మధ్య ఘర్షణ కూడా కూడా పెరుగుతోంది. శాంతియుతంగా ఆందోళనలు జరగాలని, ట్రంప్ వ్యవహారశైలిని తప్పుబడుతున్నట్టు లాస్ ఏంజెల్స్ నగర మేయర్ కరెన్ బాస్ పేర్కొన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ కూడా ట్రంప్ చర్యలను ఖండించారు. ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించారు.

ఆందోళన ఎందుకంటే?

ఈ ఆందోళనలకు ప్రధాన కారణం ఐఈసీ చేస్తున్న అరెస్టులు. రోజుకు దాదాపు 2వేల మందిని అరెస్టు చేస్తున్నారు. అయితే వారి లక్ష్యం రోజుకు 3వేల మందిని అరెస్టు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు మెక్సికన్ జెండాలు పట్టుకొని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు.