నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
31-08-2026 10:18 AM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కొత్తగా ఏర్పడ్డ మూడు మండల తాసిల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు, కేసముద్రం మున్సిపాలిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. 8 ఏళ్లగా పట్టా పాస్ పుస్తకాలకు నోచుకోని నారాయణపురం గ్రామానికి చెందిన 780 మంది రైతులకు భూభారతి ద్వారా పట్టా పాస్ పుస్తకాల పంపిణీ. కేసముద్రంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.






