31 August, 2026 | 11:33 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు

31-08-2026 10:21 AM

మంథని/కరీంనగర్, ఆగస్టు 31(విజయ క్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం మంథని, కరీంనగర్ ప్రాంతాల్లో జరిగిన పలు వివాహ, రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంథని మున్సిపల్ పరిధిలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో గుంజపడుగు గ్రామానికి చెందిన పందుల బానయ్య కుమార్తె వివాహ వేడుకకు మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం శివ కిరణ్ గార్డెన్‌లో గట్టు జయంత్–రమ దంపతుల కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కరీంనగర్‌లో రిసెప్షన్ వేడుకలకు హాజరు. అనంతరం కరీంనగర్‌లోని వసుధ కన్వెన్షన్‌లో కమాన్‌పూర్ ఎంపీడీవో సాధనవేణి ప్రియాంక–వరుణ్‌ల రిసెప్షన్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

తదనంతరం కరీంనగర్ పట్టణంలోని శుభం గార్డెన్‌లో జరిగిన నిఖిల్–సంజన మైత్రిల రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులతో మంత్రి శ్రీధర్‌బాబు ఆప్యాయంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. పలు వివాహ, రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేస్తూ, వారి వైవాహిక జీవితం ఆనందమయంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.