31 August, 2026 | 11:32 AM

హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ

31-08-2026 10:29 AM

కేసముద్రం (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పూర్వ కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ జాటోత్ సుజాత హరీష్ నాయక్ కుటుంబాన్ని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ఆదివారం రాత్రి పరామర్శించారు. హరీష్ నాయక్ తండ్రి లచ్చిరాం నాయక్ అనారోగ్యంతో పది రోజుల క్రితం కన్నుమూశారు. కేసముద్రం మండల కేంద్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమానికి వచ్చిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి హరీష్ నాయక్ గృహానికి వచ్చి లచ్చిరాం నాయక్ చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం హరీష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ వెంట మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.