15 June, 2026 | 8:17 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అందజేత

26-12-2025 04:00 PM

వాంకిడి,(విజయక్రాంతి): పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఆచూకీ గుర్తించి శుక్రవారం బాధితుడికి అప్పగించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. జంబులధరి గ్రామానికి చెందిన బలవంతరావు వాంకిడి మార్కెట్ ప్రాంతంలో తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. అదే రోజు స్థానిక వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫోన్ వివరాలు నమోదు చేసి, సెల్‌ఫోన్ ఆచూకీ కనుగొని స్వాధీనం చేసుకొని బాధితుడికి అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.