calender_icon.png 26 December, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నివిషయాలు చెప్పాను: ఆరా మస్తాన్

26-12-2025 04:02:39 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone tapping case) ఆరా మస్తాన్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు(SIT officials) ఆరా మస్తాన్ ను రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. సిట్ అధికారులు సాక్షిగా ఆరా మస్తాన్ వాంగ్మూలాన్ని రెండోసారి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ తుదిదశకు చేరుకుందని ఆరా మస్తాన్(Aara Mastan) అన్నారు. ఉన్నతస్థాయి అధికారులతో సిట్ వేశారు. గతంలో చెప్పిన విషయాలు మళ్లి అడిగారు.. అన్ని విషయాలు చెప్పానని వెల్లడించారు. ప్రభాకర్ రావు చెప్పిన అంశాలు క్రాస్ చెక్ చేసుకునేందుకు విచారణకు పిలిచారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమైన సాక్షులను విచారిస్తున్నారని మస్తాన్ చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (Special Intelligence Bureau) చీఫ్ టి ప్రభాకర్ రావును శుక్రవారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Special Investigation Team) విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయిన తర్వాత రెండు వారాల పాటు సిట్ విచారించిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేశారు.  ప్రభాకర్ రావును కస్టడీలో విచారించిన దానిపై సిట్ తన నివేదికను జనవరి 16న సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.