26-12-2025 03:57:13 PM
వాంకిడి,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల్లో నూతన గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన చునార్కర్ సతీష్ తో, పాటు వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారంకు శుక్రవారం మండల కేంద్రంలో దుర్గం దీపక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్ర మంలో పత్రు, శివాజీ, దీపక్, సిద్ధార్థ్ , దయానంద్, చమల్ , రాజ్ రతన్, స్వాగత్ తదితరులు పాల్గొన్నారు.