13 June, 2026 | 2:14 AM

మూడింట రెండొంతులపై కమలం పార్టీ కన్ను

13-06-2026 12:00 AM

2024 ఎన్నికల తరువాత మోదీ ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ, గత రెండేళ్లుగా తన బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నది. దీర్ఘకాలంగా తమతో ప్రయాణం చేస్తున్న కొన్ని పార్టీలు, పరిస్థితులను బట్టి మారే మరికొన్ని మిత్ర పక్షాలు, రాజకీయ అవసరాలు, అంశాలవారీగా మద్దతిచ్చే పక్షాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. లోక్‌సభలో ప్రస్తుతం బీజేపీకి 240 సీట్లు ఉన్నాయి.

ఎన్డీయే మిత్రపక్షాలను కలిపినా 293 సీట్లతో సాధారణ మెజారిటీ మాత్రమే ఉన్నది. మూడింట రెండొంతుల మెజారిటీ కావాలంటే 362 సీట్లు అవసరం. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోతే ఏమవుతుందో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి అనుభవంలోకి వచ్చింది. దీంతో వివిధ పార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 20 మంది టీఎంసీ ఎంపీలు లక్ష్యంగా ఆపరేషన్ లోటస్‌కు తెరదీసినట్టు తెలుస్తున్నది.

వీరితో పాటు శిరోమణి అకాలీదళ్ కూడా బీజేపీతో జతకట్టే అవకాశం ఉంది. ఎందుకంటే, త్వరలో జరుగనున్న పంజాబ్ ఎన్నికల్లో అకాలీదళ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, ఈ రెండు పార్టీల సభ్యులను కలుపుకొని ఎన్డీయే బలం 318కి చేరుతుంది. ఇక తమిళనాడులో డీఎంకేను తోసిరాజని టీవీకేతో కాంగ్రెస్ జతకట్టింది. డీఎంకే గతంలోనూ ఎన్డీయేతో కలిసి పనిచేసింది.

ఇటీవల ఇండీ కూటమి సమావేశానికి కూడా డీఎంకే డుమ్మా కొట్టింది. ఈ క్రమంలో డీఎంకేను బీజేపీ సంప్రదించవచ్చు. ఇక వైఎస్సార్సీపీ. టీడీపీతో ఆ పార్టీకి రాజకీయ శత్రుత్వం ఎట్లా ఉన్నప్ప టికీ, మొదటినుంచీ బీజేపీతో సత్సం బంధాలు కొనసాగుతూనే ఉన్నా యి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఇటీ వలి కాలంలో బీజేపీకి అనుకూ లంగానే మాట్లాడుతున్నది. ఎన్నిక ల్లో ఓటమి తరువాతి పరిణామాల క్రమంలో బీజేడీ నేత నవీన్ పట్నాయక్ మళ్లీ బీజేపీ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ మొదటి నుంచి కూడా కీలకమైన బిల్లుల విషయంలో మాత్రం బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నది. ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగించవచ్చు.

ఇక శరద్ పవార్‌కు బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇండీ కూటమితో కలిసి ఉన్నప్పటికీ, కూతురు సుప్రియ రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. పవార్‌ను బీజేపీ సంప్రదిస్తే, ఆ పార్టీకి ఉన్న 8 మంది బలం ఎన్డీయేకు చేకూరుతుంది.  కాకపోతే, టీఎంసీతో పాటు, ఎన్సీపీని విలీనం చేయాలని సోనియాగాంధీ ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు ఆ పార్టీలు ఏ మేరకు అంగీకరిస్తాయనేది చూడాలి. శరద్ పవార్‌తో పాటు డీఎంకేను తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే.. బయటి నుంచి కూడా ముఖ్య బిల్లుల విషయంలోనైనా మద్దతు ఇచ్చే పార్టీల బలాన్ని కలుపుకొంటే మోదీ ప్రభుత్వ బలం దాదాపు 355కి చేరుకుంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీకి ఇంకా ఏడుగురు తక్కువవుతారు. 

ఇక రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అంటే 163. బీజేపీ సొంత బలం 113, మిత్రపక్షాలను కలుపుకొంటే ఈ సంఖ్య 144కి చేరుతుంది. పది మంది టీఎంసీ సభ్యులను కలిపితే 154కి చేరుకుంటుంది. బీజేపీకి మద్దతుగా వైఎస్సార్సీపీ 7, బీజేడీ 5, ముగ్గురు ఇండిపెండెంట్లను కలిపితే 169 అవుతుంది. దీంతో రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ వచ్చినట్టే. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యమైన బిల్లులను పాస్ చేయించు కోవ డానికి ఈ సంఖ్య చాలా కీలకమవు తుంది. ఉమ్మడి పౌరస్మృతి, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, ఒకే దేశం, ఒకే ఓటు వంటి బిల్లులను  ఆమోదించుకోవడానికి బీజేపీకి ఇప్పుడు నంబర్ అవసరమవుతుంది. ము ఖ్యంగా లోక్‌సభలో మెజారిటీ కోసం బీజేపీ పెద్దలు చాలా జాగ్రత్తగా పావులు కదుపు తున్నారు.