calender_icon.png 13 December, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరు.. ప్రచార హోరు!

10-12-2025 12:46:59 AM

  1. తెల్లవారు జాము నుంచే జనంలోకి పంచాయతీ  అభ్యర్థులు 

ర్యాలీలు, రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం

కాలికి బలపం కట్టుకొని తిరిగిన నాయకులు

చివరి క్షణం వరకు అవిశ్రాంతంగా పర్యట నలు

ఐదు గంటలకే మైకులు బంద్, ముగిసిన  ప్రచారం 

ప్రారంభమైన ప్రలోభాల పర్వం, ఆఖరి ఎత్తుగడలో అభ్యర్థులు..

ఓటర్ల ప్రసన్నం కోసం చివరి ప్రయత్నాలు

మణుగూరు, డిసెంబర్ 9 (విజయక్రాంతి): జిల్లాలో తొలి విడత గ్రామ పం చాయ తీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నా యి. అసెంబ్లీ ఎన్నికలను మరిపిస్తూ గెలుపే లక్ష్యంగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు మంగళవారం చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించారు. ఎక్కడ చూసినా అభ్యర్థుల జోష్,జోరు కనిపించింది. పినపాక నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారంలో దూ సుకెళ్లారు.

ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అ భ్యర్థిస్తూ మరో వైపు వినూత్న ప్రచారా లతో హోరెత్తించారు. చివరి రోజున వారికీ మద్దతుగా ఎమ్మెల్యే పాయం, మాజీ ఎమ్మెల్యే రే గా, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ప్రధాన పార్టీ ల ముఖ్య నేతలు పలు మండలాలలో అవిశ్రాంతంగా సుడిగాలి పర్యట నలతో అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొ లి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార శైలి పై విజయక్రాంతి కథనం.. 

తెల్లవారుజాము నుంచే జనంలోకి..

ప్రచారం గడువు ముగుస్తుండగా అభ్య ర్థులు అసెంబ్లీ ఎన్నికలు తలెదన్నేలా తెల్లవారుజాము నుంచే జనంలోకి వెళ్లిప్రచారం చే స్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ఇక ఉన్న సమయంలోనే ఓటర్ల మద్దతు ను కూడగట్టే ప్రయ త్నం చేశారు. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ అశ్వాపు రం, భద్రాచలం, బూర్గంపా డు, చర్ల, దు మ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లో జరుగుతుండడం తో అభ్యర్థులు గెలుపు కోసం శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

సర్పం చ్, వార్డు లకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక అవ కాశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. తమ ను గెలిపిస్తే సమస్యలను పరిష్కరి స్తామ ని హామీ ఇస్తున్నారు. గెలిపిస్తే వారు ఏమి చేస్తారో చెబుతూనే పూర్తిస్థాయిలో ప్రచా రంలో నిమగ్నమై ఓట్ల కోసం మద్దతు కూ డగట్టే ప్రయత్నాలను చేశారు.

ప్రలోభాల పర్వం, ఆఖరి ఎత్తుగడలో అభ్యర్థులు..

ఉన్న కొద్ది సమయం ఒక్క క్షణం కూడా వృథా కాకుండా అభ్యర్థులు మద్యం, నగదు పంపిణీపై నజర్ పెట్టారు. తమకు న్న బలబలాలను అంచనా వేసుకుని గెలుపునకు అ వసరమైన ఓట్లను కొనేం దుకు ఏర్పాట్లను చేసుకోని, కొన్ని గ్రామా ల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల వరకు పెట్టేందుకు సిద్ధ మవుతున్నా రు. నిఘా ఉండటంతో త మకు దగ్గరగా ఉన్న బంధువు లు, స్నేహితుల ద్వారా మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఏయే పా ర్టీకి చెంది న ఓట్లు ఎన్ని వస్తాయి. కూడిక లు తీసి వేతలు వేస్తూ, ఒక్కో ఓటుకు రూ.500 నుంచి వేయి వరకు పంపిణీ చేస్తున్నారు.

గ్రామంలో పార్టీ నా యకులు సూ చించిన వారితో పాటు తట స్తులకు, ఎదుటి పార్టీలో ఉన్నా, డబ్బులి స్తే తమ కు ఓటు వేస్తారనుకునే వారికి నగదు అం దజేస్తున్నారు. ప్రచారం ఒక ఎత్త యితే.. ఓట్లు రా బట్టుకునేందుకు ఎంతో కీలక మైన ఎన్నికల క్రతువులో వచ్చే కొన్ని గంటలూ మరో లెక్క అన్న ట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు ఆకర్షించడానికి భారీగానే తాయిలాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ఎన్నికలు గత ఎన్నిక లతో పోలిస్తే భిన్నంగా జరుగుతు న్నాయి.పంచాయతీలు చిన్న వి పెద్దవి అని తేడా లేకుండా గెలుపు కోసం ఓట్ల ను కొనేందుకు అభ్యర్థులు సిద్ధమవుతు న్నారు.