నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
13-06-2026 03:35 PM
హైదరాబాద్: నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొల్లాపూర్ మండలం, ఎల్లూర్ గ్రామ శివారులో వివాహిత, యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో గొడవ పడి వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన మహిళ, పెళ్లికి ముందే పరిచయం ఉన్న యువకుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులిద్దరూ శివ(25), రేణుక(22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.






