19 August, 2026 | 1:58 AM

ఉద్యోగుల ఉద్యమ బాట

19-08-2026 01:09 AM

ఈహెచ్‌ఎస్, ఓపీఎస్ పునరుద్ధరణ, పీఆర్‌సీ అమలు, పెండింగ్ బిల్లులు విడుదల, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉద్యోగ జేఏసీ ఆందోళన బాట

ఉద్యమ కార్యాచరణ..

* ఈనెల 27న 33 జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు

* సెప్టెంబర్ 1న జిల్లా  కేంద్రాల్లో పెన్షన్ విద్రోహ దినం.. నిరసన కార్యక్రమాలు 

* సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్/మహా ధర్నా

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచ ర్స్ వర్కర్స్, పెన్షనర్స్ జేఏసీ ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. మంగళవారం టీఎన్‌జీవో భవన్‌లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్ర టరీ జనరల్  ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జేఏసీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో   పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు, సీపీఎస్ రద్దు--ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డుల అమలు, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీవో 25 సవరణ, జీవో 190 అమలు తదితర సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దశల వారిగా ఉద్యమం చేయాలని తీర్మానం చేశారు. 

ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చినా అమలు కావడంలేదని, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్నారు. ఈ విషయంలో సీఎస్ కూడా ఆసక్తి చూపడం లేదని, హాస్పటల్ యజమాన్యాలకు పాత బకాయిలు కూడా విడుదల చేయడం లేదని  జేఏసీ నేతలు తెలిపారు.

నగదురహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగం, ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల్లో సేవలు, బిల్లుల పరిష్కారం వంటి అంశాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది. రెండవ పీఆర్‌పీ కమిటీ నివేదికను అమలుచేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్ అమలు, ఆరు పెండింగ్ డీఏల ను అమలుచేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.

వీటితో పాటు బీటీఎన్జీవోస్ హౌసిం గ్ సోసైటీ భూ సమస్యను పరిష్కరించాలని, వీబీజీ రామ్‌జీ ఉద్యోగులకు పేస్కేల్ అమ లు, డిగ్రీ కాళాశాల అధ్యాపకులకు యూజీపీ 7వ వేతన సవరణ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అప్పటి వరకు ఉద్య మం కొనసాగుతుందని స్పష్టం చేశారు.