12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

‘లగ్జరీ సలోన్ బ్రాండ్ హవానా’

06-04-2026 12:59 AM

కోకాపేట్‌లో ఘనం ప్రారంభం

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అందం, వెల్నెస్ రంగంలో ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే ప్రీమియం లగ్జరీ సలోన్ బ్రాండ్ హవానా ది సలోన్ కోకాపేట్‌లో తన మూడవ అవుట్లెట్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించింది. ప్రొఫెషనల్ మోడల్స్తో నిర్వహించిన ఎలిగెంట్ ఫ్యాషన్ వాక్ కార్యక్రమానికి మరింత ఆకర్షణను తీసుకువచ్చింది. ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ యాంకర్ శివ జ్యోతి (సావిత్రి) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రౌండ్ ఫ్లోర్, రైచందాని బిజినెస్ బే, రాజ్ పుష్ప రెగాలియా ఎదురుగా, కోకాపేట్, నర్సింగిలో ఏర్పాటు చేసిన ఈ కొత్త అవుట్లెట్, హవానా బ్రాండ్ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. హవానా వద్ద హెయిర్ స్టైలింగ్, హెయిర్ కలరింగ్, స్కిన్ ట్రీట్మెంట్స్, మేకప్, నెయిల్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ప్రత్యేక నిపుణులు సేవలు అందిస్తున్నారు.

ప్రతి కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కన్సల్టేషన్ ఆధారంగా సేవలను అందించడం ద్వారా వ్యక్తిగత అనుభవాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా హవానా ఫౌండర్ విధాత మునుకుట్ల మాట్లాడుతూ.. హవానా అనేది కేవలం సలోన్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేక అనుభవాన్ని సృష్టించే బ్రాండ్. బెంగళూరులో ప్రారంభమై హైదరాబాద్ వరకు మా ప్రయాణంలో నాణ్యత, స్థిరత్వం మరియు బ్రాండ్ ఐడెంటిటీపై మా దృష్టి ఎప్పుడూ ఒకటే అన్నారు.