6 July, 2026 | 4:21 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం.హరిత

29-09-2025 01:29 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఎం.హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.