calender_icon.png 29 September, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి దేవి అలంకరణలో ముగ్గురమ్మలు

29-09-2025 01:26:14 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల త్రిశక్తి క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి  ఉత్సవాల్లో  భాగంగా 8వ రోజు అమ్మవార్లు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి  అమ్మవార్లను తెల్లని రంగు వస్త్రాలతో అలంకరించి  ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చదువుల తల్లి అయిన సరస్వతి దేవి అవతారంలోని అమ్మవారిని పూజించినట్లయితే సకల విద్యలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.