మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రోత్సాహం
26-01-2025 01:02 AM
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్‌వైఎఫ్’. పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాటి, మహేశ్ రాటి, ఏ రామస్వామిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఎక్కువ బడ్జెట్ పెట్టి తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది. తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రాలను ప్రోత్సహించడంలో నేను ముందుంటాను’ అన్నారు.






