01-02-2026 07:41:14 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మారుమూల గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన మడావి లక్ష్మణ్ సేవలు గిరిజన సంక్షేమ శాఖకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని TSTWTU రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ రాములు నాయక్ అన్నారు. ఉట్నూర్ పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ పదవి విరమణ కార్యక్రమంలో ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్, జిల్లా అధ్యక్షులు రాథోడ్ రవీందర్ తో కలసి పాల్గొని ఆయన శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మడావి లక్ష్మణ్ సౌమ్య స్వభావంతో అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉత్తమ సేవలు అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అశోక్, జిల్లా నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.