01-02-2026 07:46:04 PM
వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితులు ధర్నా
బాలిక మృతికి కారకులైన వైద్యులను శిక్షించాలని డిమాండ్
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఐదు గంటల పాటు ఉద్రిక్తత
పోలీసుల బందోబస్తు
బాధిత కుటుంబికులకు నచ్చజెప్పిన పోలీసులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కుక్క కాటు మందు కోసం వస్తే బాలిక ప్రాణాన్ని బలి తీసుకున్నారంటే బాలిక తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్ లో నివాసముంటున్న అర్చన రమేష్ ల కూతురు రెండు సంవత్సరాల ఆరు నెలల బాలిక క్రితారాశ్రీకి కుక్క కాటు వేయడంతో ఇంజక్షన్ కోసం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
గతంలో రెండు డోసులు ఇంజక్షన్లు ఇచ్చారు. మూడో డోస్ ఇంజక్షన్ కోసం ఆదివారం ఆసుపత్రికి క్రీతార శ్రీని తీసుకురాగా ఇంజక్షన్ వేయించిన కొద్దిసేపటికే పాప కోమాల్లోకి వెళ్లినట్లు పాప తల్లిదండ్రులు అర్చన, రమేష్ తెలిపారు. ఈ విషయాన్ని వైద్యులకు చెప్పగా నిర్లక్ష్యంగా వ్యవహరించ దమ్ వల్లనే తమ పాప మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ తెలిపారు. పాప మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కాలనీవాసులు బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వచ్చి వైద్యుల నిర్లక్ష్యంపై నిలదీశారు.
దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి పై రాళ్లు రూవ్వడంతో పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చి బందోబస్తు నిర్వహించారు. బాలిక మృతికి కారకులైన వైద్యున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాసరావు, పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, రూరల్ సీఐ రామన్, భిక్కనూర్ సిఐ సంపత్ కుమార్ ఎస్సైలు పెద్ద ఎత్తున వచ్చి పోలీస్ బలగాలతో చేరుకొని ఉదిరిక్తత పరిస్థితిని తగ్గించారు.
బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని సముదాయించే ప్రయత్నం చేశారు. 5 గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి తగిన న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో బాలిక కుటుంబ సభ్యులు పోస్ట్మార్టం నిర్వహించేందుకు అంగీకరించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా బాధ్యులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బాలిక తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.