01-02-2026 07:37:11 PM
డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు గుగ్గిళ్ల భరత్ గౌడ్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయనను డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పరామర్శించారు. భరత్ గౌడ్ స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా వెంటనే అండగా ఉంటానని స్పష్టం చేశారు.
భౌతిక దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ జిల్లా మెంబర్ సంగీతం శ్రీనాథ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు, ఏఎంసీ డైరెక్టర్ గుగ్గిళ్ల రాములు, సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ గడ్డం మధుకర్ (చోటు), గుగ్గిళ్ల అభినయ్ గౌడ్, గడ్డమీది శ్రీనివాస్, సుంచుల కుమారస్వామి, గుగ్గిళ్ల శ్రీనివాస్, అంకారపు మహేష్, అభిషేక్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.