22 August, 2026 | 8:20 PM

Breaking News

ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన   •   సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం   •   ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం   •   శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్   •   పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి   •   ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా   •   ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య   •  

మెట్‌పల్లి నూతన జడ్జీగా మాధవి

01-05-2026 12:37 AM

మెట్ పల్లి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మెట్ పల్లి నూతన జూనియర్ సివిల్ జడ్జి గా వినుకొండ మాధవి పదవీ బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా మెట్ పల్లి లో పనిచేస్తున్న నారం అరుణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు కు బదిలీ కాగా, ఖమ్మం జిల్లా మూడవ అదనపు కోర్టు మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్న మాధవి మెట్ పల్లి కోర్టుకి బదిలీపై వచ్చారు.

గురువారం ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి పూల మొక్క అందించి వారికి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, క్రీడా కార్యదర్శి నీరటి రమణ, జూనియర్ ఈసి మెంబెర్ మాలేపు సంధ్య రాణి, న్యాయవాదులు కోటగిరి వెంకట స్వామి, చైతన్య, సత్యనారాయణ, మన్నె గంగాధర్ ఉన్నారు.