30 August, 2026 | 6:44 PM

Breaking News

సమాజ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలి   •   మాజీ ఎంపీపీ జగన్ మోహన్‌రావుకు పరామర్శ   •   అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆలరించిన పల్లి గ్రామ భక్తులు   •   కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుని కృషి   •   భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన   •   ఎంఎస్‌పీ గణపురం మండల అధ్యక్షుడిగా నాగరాజు   •   నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు   •   మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆపన్నహస్తం   •   48గంటల రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన గొండ్వాన సంక్షేమ పరిషత్   •   జగన్నాధపురంలో ‘గ్రోమోర్’ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ వినోద్   •  

మధు కలెక్షన్ గ్రాండ్ ఓపెనింగ్

30-08-2026 05:38 PM

షోరూమ్‌ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ , ఆగస్టు 30విజయక్రాంతి: డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “మధు కలెక్షన్” 1 గ్రాము ఇమిటేషన్ జ్యువెలరీ షోరూమ్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన ఆభరణాలను అందుబాటు ధరల్లో అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానికంగా కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

మధు కలెక్షన్‌లో వివిధ రకాల 1 గ్రాము ఇమిటేషన్ జ్యువెలరీ, ఆధునిక ట్రెండీ డిజైన్లు, ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక రాయితీలు, ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు