29 April, 2026 | 3:22 AM

కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్

29-04-2026 01:48 AM

కామారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి డిఎస్పీగా మధుసూదన్ మంగళవారం కామారెడ్డికి బదిలీ అయ్యారు. ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇంటిలిజెంట్ డిఎస్పీగా ఉన్న మధుసూదన్ కామారెడ్డి డిఎస్పీగా నియమితులయ్యారు. గతంలో  సిఐ గా పని చేసినా ఆయన మూడు సంవత్సరాల తర్వాత డిఎస్పీగా తిరిగి వస్తున్నారు. కామారెడ్డిలో ఏ ఎస్ పి గా పనిచేసిన చైతన్య రెడ్డి సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా బదిలీ అయిన విషయం విధితమే.