21 March, 2026 | 11:21 AM

పేద ముస్లింలకు అండగా మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ

21-03-2026 12:50 AM

కోదాడ, మార్చి 20 : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ చేయూతనిచ్చింది. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ నేహా నాజ్, సొసైటీ అధ్యక్షులు అహ్మద్ మౌలానా నాద్వి కలిసి 100 మందికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పేదలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. అహ్మద్ మౌలానా నాద్వి మాట్లాడుతూ ప్రతి ఏటా తమ సొసైటీ తరపున సామాజిక బాధ్యతగా ఈ సాయం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాగ్దాద్, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.