21 March, 2026 | 9:24 AM

విద్యార్థులు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి

21-03-2026 12:51 AM

పాఠశాలను సందర్శించిన జిల్లా మానిటరింగ్ టీం

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి20: విద్యార్థులకు అన్ని రకాల సబ్జెక్టులు,భాషలపై కనీస పరిజ్ఞానం ఉండాలని జిల్లా మానిటరింగ్ టీం సభ్యులు కోతి రమేష్,గుండేటి లక్ష్మణ్ లు అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలు, వారి రికార్డులు, జవాబు పత్రాలు, పాఠశాల పరిసరాలు, తరగతి గదుల పరిశీలనతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ముగిసే సమయం ఆసన్నమైనందున ప్రణాళికా బద్ధంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ హెచ్‌ఎం చంద్రారెడ్డి, ఉపాధ్యాయులు రాములు, శోభ, మల్లికార్జున్ గౌడ్, విజిత, సురభి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.