13-02-2026 12:00:00 AM
ఇంచార్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 12(విజయ క్రాంతి): మహా శివరాత్రి జాతరను అన్ని శా ఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి. విజయవంతం చేయాలని ఇంచా ర్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ నెల14, 15, 16తేదీల్లో మహా శివరాత్రి జాత ర సందర్బంగా అన్ని శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు.
భీమేశ్వర ఆలయంలో మ హా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులు స్వామి వారి దర్శనాన్ని సౌకర్యంగా చేసుకునేలా తుది దశ ఏర్పాట్లు ముమ్మరంగా చే యాలని ఆదేశించారు.భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ లు సిద్ధం చేయాలని ఆర్టీసీ అ ధికారులకు సూచించారు. జడ్పీ డిప్యూటీ సీఈఓ, వేములవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు ఇతర చోట్ల మూడు షిఫ్ట్లలో సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు.
జాతరకు ముందు నుంచి తరువాత మూడు రోజుల వరకు పారిశుధ్య సేవలు అందించాలని సూ చించారు. జిల్లాసంక్షేమ శాఖ అధికారి ఆద్వర్యంలో బస్సు స్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల పూర్తి వివరాలతో హెల్ప్ డెస్క్ లు సిబ్బంది అందుబాటులో పెట్టాలని, ప్రతి చోట అన్ని వివరాలతో కూడిన సైన్ బోర్డులు పెట్టించాలని తెలిపారు. ఆలయంలోని క్యూల వద్ద,పార్కింగ్ స్థలాల వద్ద, బస్సు స్టాండ్లలో తాగు నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సెస్ అధికారులు భీమేశ్వర ఆలయం, బద్ది పోచ మ్మ ఆలయం, ఇతర చోట్ల 24 గంటల పా టు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని, అధికారులు, సిబ్బంది ఉండాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖా ఆద్వర్యంలో భీమన్న ఆలయం, ప్రసాదం కౌంటర్, పా ర్కింగ్ స్థలాలు ఇతర చోట్ల వైద్యులు, సిబ్బం ది, అంబులెన్స్ లతో సిద్దంగా ఉండాలని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా,
అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అగ్ని మాప క శాఖా అధికారులు ప్రధాన ఆలయాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు చెక్ చేయాలని, వారి సిబ్బంది గుడి ఆవరణలో జాతర సమయం లో సిద్దంగా ఉండాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు భక్తులకు అందించే ప్రసా దం, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించాలని ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్ లో ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు ఉన్నారు.