అల్ఫోర్స్ లో గణనాధునికి మహాప్రసాదం

16-09-2026 | 12:35am

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి(Kothapalli)లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల(Alfors E-Techno School)లో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రెండో రోజు మహాగణపతికి సుమారు 108 రకాల ప్రసాదాలతో మహా ప్రసాదం సమర్పించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల నిర్వాహకులు డాక్టర్ వి వనజానరేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గణనాథుడు అంటే సకల బాధల నుండి విముక్తి కల్పించేవాడని, విజ్ఞాలను తొలగించి చక్కని విద్యను అందించేవాడని, ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించేవాడు గణనాథుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు