17 April, 2026 | 9:42 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

చేవెళ్ళకు మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శైలేష్

04-02-2026 01:25 AM

చేవెళ్ళ, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగారా మొగిన నేపథ్యంలో బిజెపి పార్టీ మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శైలేష్ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ జెనరల్ సెక్రటరీ తుళ్ళ వీరేందర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పార్టీ శ్రేణులతో కలిసి చేవెళ్లలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీపై ప్రజాదారణ ఎన్నికల ప్రచార నిర్వహణ అభ్యర్థుల గెలుపు వ్యూహంపై ఆరా తీశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయబాహుట ఎగరవేసేందుకు పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... చేవెళ్ళ మున్సిపల్ లో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు.

శత్రుదేశం పై చేసిన సింధు ఆపరేషన్ సింధుర్ మహారాష్ట్ర విమాన ప్రమాదం చైనా దేశం ఉద్దాతంకులపై ప్రతిపక్ష నేతలు దిగజారి కామెంట్ చేయడం సరికాదని మోడీ ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నరన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్తో డీల్ కుదిరితే మోడీ ముందు ట్రంప్ తలదించు కుండని, దాన్ని దేశ ప్రధాని తల దించుకున్నాడని పార్లమెంట్ లో అనడం సబబు కాదన్నారు.

ప్రెస్ మీట్ లో మున్సిపల్ అధ్యక్షుడు అత్తేలి అనంతరెడ్డి, డా. వైభవ్ రెడ్డి, మండల అధ్యక్షుడు మున్నూరు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సర్వలింగం, ఆంజనేయులు, గౌడ్ శ్రీకాంత్ రెడ్డి, పెద్దొళ్ల దయాకర్, కేశేపల్లి వెంకటరామిరెడ్డి మున్సిపల్ అభ్యర్థులు పాల్గొన్నారు.