29 June, 2026 | 2:04 AM

విద్యతోనే సమాజంలో గుర్తింపు..

29-06-2026 12:00 AM

ఆదివాసీ పర్ధాన్ సమాజ్ రాష్ట్ర మహా సమ్మెళనంలో మహారాష్ట్ర మంత్రి అశోక్

ఆదిలాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఆదివాసీ పర్ధాన్ సమాజ్ ఐక్యత కోసం అందరు కలిసి కట్టుగా ముందుకు సాగాలని అప్పుడే సమాజాభివృద్ధి సాధ్యం అవుతోందని మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అశోక్ ఉయికే అన్నారు. అన్ని రంగాల్లో వెనకబడిన మన జాతీ ప్రజలు తమ పిల్లలను చదివిస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆదివాసీ పర్ధాన్ సమాజ్ రాష్ట్ర మహా సమ్మెళనానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రికి ఆదివాసీ గుస్సాడీలతో ఘనంగా స్వాగతం పలికి, గజామలతో సత్కరించారు. అనంతరం కుమురంభీం విగ్రహానికి పూమలాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ఎస్టీయూ భవన్ వరకు ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాల నడుమ చేపట్టిన ర్యాలీలో మంత్రితో పాటు పర్దాన్ సమాజ్ నేతలు సభస్థలికి చేరుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి,  సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించిన వారితో పాటు రాజకీయాల్లో రాణిస్తున్న వారిని శాలువతో సత్కరించారు.   

ఈ సందర్భంగా మంత్రి అశోక్ ఉయికే మాట్లాడుతూ... పర్దాన్ సమాజంలో రాజకీయ ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉండడం కారణంగా ఆశించిన స్థాయిలో అబివృద్ధి చెందలేక పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని పిల్లలందరు ఉన్నత శిఖరాలను అధిరోహిం చాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎక్కడ ఎన్నికలు లేవని, తాను ఎన్నికల ప్రచారం కోసం రాలేదని, సమాజాభివృద్ధిని కాంక్షిస్తు తెలంగాణ లో నిర్వహించిన సమ్మెళనానికి హాజరై సమాజ్ ప్రజలను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు జాతీ సభ్యులను ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదపూర్వకంగా మెలగలని సూచించారు.

అప్పుడే మనలో ఐక్యత వేరిగి సమస్యల పరిష్కరానికి కలిసికట్టుగా ఉద్యమించాడానికి అస్కారం ఉంటుందన్నారు. సమాజంలో పర్ధాన్ జాతీ కూడా ఒకటి ఉందని గుర్తించేలా హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. సమాజ అభివృద్ధి, సమస్యలు ఎమున్న తమ దృష్టికి తీసుకువస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా సమాజం కోసం తాను పని చేస్తానని వేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో ఆదివాసీ పర్దాన్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేష్, జిల్లా అధ్యక్షుడు గోడం గంగారాం, నాయకులు కోవ మనోహర్, గెడం తులిదాన్, గెడం వనిత, గెడం గీత, హీరసుఖ జానజాగృతి నాయకులు సిడాం రాంకిషన్, సిడాం రవి పాల్గొన్నారు.