14-02-2026 05:31:29 PM
- బుగ్గ దేవాలయం ముస్తాబు
- బారీగా తరలిరానున్ను భక్తులు
- భారీగా పోలీసు బందోబస్తు
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శ్రీ బుగ్గ దేవాలయం వేడుకలు ముస్తాబు అయింది. కన్నాల మండలం శివారు అటవీ ప్రాంతంలోనీ గుట్టల్లో వెలసిన శ్రీ రాజరాజేశ్వర బుగ్గ దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలకులకు ఎంతో ప్రసిద్ధిగాయిచ్చింది. భక్తుల ఇలవేల్పుగా కొలుస్తారు. ఈ మేరకు దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాలయాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా దర్శనం కోసం బార్కెట్లు ఏర్పాటు చేశారు.
అత్యవసర సేవలు అందుబాటులో ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు ఈ జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. వేలాది మంది భక్తులు బుగ్గజాతరకు తరలివస్తారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ముక్కులు చెల్లించుకుంటారు. మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఉపవాసాలతో పవిత్రంగా జరుపుకుంటారు. మా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆర్టీసీ యాజమాన్యం బుగ్గ దేవాలయానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ నుంచి బుగ్గ దేవాలయానికి ప్రత్యేక బస్సు, రవాణా సదుపాయం కల్పించింది.