calender_icon.png 10 May, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా బసవేశ్వరుడు అందరికీ ఆదర్శప్రాయుడు

10-05-2025 01:48:49 AM

బిచ్కుంద పీఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్యస్వామీజీ 

బాన్సువాడ, మే 9 (విజయక్రాంతి): బాన్సువాడమండలంలోని శుక్రవారం  ఇబ్రహీంపేట్‌లో మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ బసవే శ్వరుని ఆదర్శంగా తీసుకొని కులమతాలకతీతంగా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని అన్నారు.

ప్రతి ఒక్కరూ విభూతి ధరించాలని, శివలింగ పూజ చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు దేవేందర్, హన్మాండ్లు, అంజు, డెగ్లూర్ శంకర్, మల్లికార్జున్, సంగప్ప, భాస్కర్, లింగం, శంకర్, జాయి సుదీప్, శ్యాం, గంగాధర్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.