calender_icon.png 10 May, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవోకే స్వాధీనమే పరిష్కారం

10-05-2025 01:50:25 AM

ఇదే మోఖా..

  1. సైన్యం రమ్మంటే వెళ్లడానికి నేను సిద్ధం 
  2. పాకిస్థాన్‌పై పోరాటానికి వెనకాడేది లేదు
  3. యుద్ధానికి కాలుదువ్వితే పతనమయ్యేది వాళ్లే
  4. రాష్ట్రమంత్రి, కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): జమ్మూపై చేసిన దాడికి ఇండియన్ ఆర్మీ పాక్‌పై ప్రతిదాడి చేయడమే సరైన చర్య అని, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను ఇండియాలో విలీనం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని రాష్ట్ర భారీనీ టి పారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. భారత్-పాక్ మధ్య పూర్తిస్థాయిలో యు ద్ధం జరిగి.. తన అవసరముందని సైన్యం పిలిస్తే వెళ్లడానికి తాను సిద్ధమని.. పాక్‌పై పోరాటానికి వెనకడుగు వేసే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.

యుద్ధమే వస్తే పాకిస్థాన్‌కు పతనం తప్పదని, ప్రస్తుత పరిస్థితిని చూస్తే పాక్ పతనానికి చివరి అంచులో ఉన్నట్టు తెలుస్తుందని తెలిపా రు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా తో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. యుద్ధంలో పాల్గొనేందుకు ఇతర ఏ దేశం ముందుకురాకపోవ చ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత చర్య చాలా దుర్మార్గమని, మతం పేరు అడిగి చంపడం హేయ మైన చర్య అంటూ ఆయన ఖండించారు.

హిందూ, ముస్లింల మధ్య విభేదాలు పెంచాలన్న ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడిన్నట్టు స్పష్టమవుతుందని చెప్పారు. టీఆర్‌ఎఫ్ అనేది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని చెప్పారు. పాకిస్థాన్ నిర్వాకానికి బుద్ధి చెప్పడమే సరైన చర్య అని, ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు, కామికసేన్ డ్రోన్లు పని చేశాయని తెలిపారు. పాక్ భూగంలోకి వెళ్లకుండానే 100 కిలోమీటర్ల దూరం నుంచే రాఫెల్ యుద్ధ విమానం లక్ష్యాలను పేల్చిసిందని వెల్లడించారు.

రాఫెల్‌ను కూల్చేశామంటూ పాక్ అసత్య ప్రచా రాలు చేస్తుందని మండిపడ్డారు. తనకున్న సమాచారం ప్రకారం పెద్దపెద్ద గుండ్ల లాంటి సామర్థ్యం ఉన్న బాంబులతో కాల్పులు జరిపి అమాయకులపై పాకిస్థాన్ దాడి చేసిందన్నారు. కానీ మన సైనికులు ఇండియా భూభాగం నుంచే దాడి చేసి, లక్ష్యాన్ని ధ్వం సం చేయడంలో విజయవంతమయ్యారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 

20 ఏళ్లలోనే ఫైటర్ పైలెట్‌గా పనిచేశా.. 

‘నేను 16 ఏళ్ల వయసులోనే రక్షణారంగంలో చేరా. 20 ఏళ్లకే పైలెట్‌గా పనిచేశా. 1982లో మిగ్-21 జెట్‌కు, ఆ తర్వాత మిగ్-23 అత్యాధునిక విమానానికి పైలెట్‌గా పనిచేశా. శబ్దవేగానికి 2.5 రేట్లు ఎక్కువ వేగంతో మిగ్-23 దూసుకెళ్తుంది. వేగం పెరిగే కొద్ది వింగ్స్ వెనక్కి వెళ్తాయి. రన్నింగ్‌లో స్పీడ్ పెరిగే కొద్ది రాకె ట్ ఆకారంలో మిగ్ మిషన్ కనిపిస్తుంది. భారత్ సైనిక సామర్థ్యంతో పోలిస్తే పాక్ ఎక్కడా తూగలేదు.

యుద్ధానికి కాలుదువ్వితే ఆ దేశానికి తీవ్ర నష్టం తప్పదు. పాక్ కాల్పులు జరిపిన ప్రాంతాల్లోనే సుదీర్ఘకాలం పాటు చేశా’ అని కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన అనుభవాలను వివరించారు. ఉగ్రవాదులు ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేయడం అమానవీయమని, ఈ సమయంలో పాక్‌కు బుద్ధి చెప్పడమే సరైన చర్య అని ఉత్తమ్ పేర్కొన్నారు. అంతర్గత కలహాలతో పాక్‌లో అభివృద్ధి కుదేలైందని, ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితిలో ఉందని తెలిపారు.

రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షే ఖర్చు 

మంత్రుల హెలికాప్టర్ పర్యటనపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తే గంటకు 3 వందల లీటర్ల ఫ్యూయల్ ఖర్చవతుందని, తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రూ.1 లక్ష నుంచి రూ.1.20 లక్ష వరకే ఖర్చు అవుతుందని, అ దే రోడ్డు మార్గంలో వెళ్తే పోలీసులు, అధికారులు, కాన్వాయ్ ఖర్చులన్ని కలిపి ఇంతకం టే ఎక్కువే అవుతాయని మంత్రి తెలిపారు. కార్యక్రమానికి ముగ్గురు లేదా నలుగురు మంత్రులం వెళ్తామని, టై మ్ కూడా కలిసి వస్తుందన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టుల సమీక్షకు వెళ్లిన ప్పుడు సగం రోజులోనే రివ్యూ చేశామని, రోడ్డుమార్గంలో వెళ్లి సమీక్షించాలంటే నాలుగు రోజులు పడుతుందన్నారు. హెలికాప్టర్‌లో తిరగాలనే షోక్ లేదన్నారు. విస్తృతంగా పర్యటిస్తూ పని చేస్తున్నామనే కడుపుమంటతో తమపై ఆరోప ణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.