10-05-2025 01:47:25 AM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, మే 9 (విజయ క్రాంతి): జాకోర ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం జాకోర ఎత్తి పోతల పథకం నిర్మాణం కోసం, జాకోర గ్రామంలో నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జాకోర ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తొమ్మిది గ్రామాల పరిధిలోని 4,470 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుంద అన్నారు.
జాకోర ఎత్తి పోతల పథకం కోసం జాకోర గ్రామంలో శుక్రవారం నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసుకున్నా మని తెలిపారు. ఎత్తిపోతల పథకం పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.