మహాత్మా జ్యోతి రావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం
ఒడితల ప్రణవ్ బాబు
హుజురాబాద్: సమాజంలో విద్య సమాన హక్కు అని, కులాలకు,మతాలకు అతీతంగా విద్య అందరికీ అందివ్వాలని నినదించిన మహనీయులు పూలే దంపతులు అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ డివిజన్లో అన్ని మండలాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
హుజరాబాద్ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రణవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ లాంటి వారు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని వాటికి అనుగుణంగా పని చేశారని, రానున్న తరాలకు మహనీయులను స్మరించుకునేందుకు ఈ వేదికలు చాలా ఉపయోగపడుతాయని అన్నారు. హుజురాబాద్ లో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని పూలే జయంత్యోత్సవ కమిటీ సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థ మెరుగైన స్థాయిలో ఉందని, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా శాఖ మంత్రిగా ఉండడం, వారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను, పూలే విద్యాలయాలను తీర్చిదిద్దుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్లు,హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,పూలే జయంతి కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




