1 June, 2026 | 9:42 PM

దురాజ్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

01-06-2026 09:10 PM

కారు ఢీకొని వ్యక్తి మృతి.. మనుమడికి తీవ్ర గాయాలు

చివ్వెంల,(విజయక్రాంతి): జాతీయ రహదారి-65పై దురాజ్‌పల్లి సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం కాచవారిగూడెం గ్రామానికి చెందిన మల్లెబోయిన పెద్ద సైదులు (60) తన మనుమడు తేజతో కలిసి బైక్‌ (AP 24 B 9213)పై దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి ఆలయానికి పండుగ నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో దురాజ్‌పల్లి వద్ద సూర్యాపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు (AP 39 KN 1144) వెనుక నుంచి అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సైదులకు తలకు తీవ్ర గాయం కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మనుమడు తేజకు తలకు గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి భార్య మల్లెబోయిన మల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.