మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మహేష్ దరఖాస్తు
09-03-2026 07:32 PM
వాంకిడి,(విజయ క్రాంతి): వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మండలంలోని బంబార గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు డికొండ మహేష్ సోమవారం దరఖాస్తు సమర్పించారు. కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు ఆయన తన దరఖాస్తును అందజేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి కార్యకర్తలను ఐక్యంగా ముందుకు నడిపిస్తానని తెలిపారు. వాంకిడి మండలంలో పార్టీని మరింత బలపరచడం, కార్యకర్తలకు అండగా నిలవడం, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




