10 March, 2026 | 5:56 AM

మహిళా టీచర్లకు ఘనంగా సన్మానం

09-03-2026 07:44 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో నిత్యజీవితంలో మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు అందించే పోలీసు అధికారులను,  విద్యార్థులను ఆన్ని రంగాల్లో తమదైన శైలిలో తీర్చు దిదద్దుతున్నటువంటి ప్రభుత్వ టీచర్లు  గీతాదేవి, హరిప్రియ, రమాదేవిలను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీఎన్కేసీజీఎఫ్ అల్లంకి లింగమూర్తి, జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రెటరి కాసం సత్యనారాయణ, ఎల్లంకి రాజన్న, జోన్ చైర్మన్ అల్లంకి హరిష్ కుమార్,వాసవి క్లబ్ అధ్యక్షులు రామిడి రవీందర్, ఉపాధ్యక్షుడు నార్ల శ్రీనివాస్, సీనియర్ వాసవి క్లబ్ సభ్యులు పల్లా అశోక్,  క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.